బైక్ ను ఢీకొన్న హీరోయిన్ జరీన్ ఖాన్ కారు!

  • గోవాలో ఘటన
  • వెంటనే స్పందించిన జరీన్ ఖాన్
  • తీవ్ర గాయాలైన యువకుడు ఆసుపత్రికి తరలింపు
బాలీవుడ్ నటి జరీన్‌ ఖాన్ ప్రయాణిస్తున్న కారు, బైక్‌ పై వెళుతున్న ఓ యువకుడిని ఢీ కొట్టింది. ఈ ఘటన గోవాలో చోటు చేసుకోగా, జరీన్ ఖాన్  వెంటనే స్పందించి, బాధితుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గోవాలో బైక్‌ పై హెల్మెట్ లేకుండా ఓ యువకుడు ప్రయాణిస్తుండగా, దాన్ని జరీన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.

ఈ ఘటనలో యువకుడి బైక్ డివైడర్‌ ను ఢీకొనగా, అతని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కారు డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. సల్మాన్‌ ఖాన్ తో 2010లో 'వీర్' చిత్రంలో జరీన్ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. హిందీతో పాటు కొన్ని తమిళ, పంజాబీ చిత్రాల్లోనూ ఆమె నటించింది.
Go Back to Shorts
Goa
Road Accident
zareen Khan

More Telugu News